ప్రభు స్తుతి
ఓ పర్వర్దిగార్ !
సర్వపోషకా ! సర్వరక్షకా !
నీవు ఆదియును అంతమును లేనివాడవు,
అద్వయుడవు,నిరుపమానుడవు,
నీ ప్రమానమెవ్వరును ఎరుంగనేరరు.
నీవు వర్ణము,నామము,రూపము,గుణములు లేని వాడవు,
నీవు అపరిమితుడవు,గంభీరుడవు .ఉహాతీతుడవు,
భావనాతీతుడవు,శాశ్వతుడవు ,నాశనము లేనివాడవు,
నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గానినిన్నుఎవ్వరును చూడజాలరు.
నీవు ఎల్లప్పుడూ నుంటివి,నీవు ఎల్లప్పుడూ నున్నావు,
నీవు ఎల్లప్పుడూ నుందువు,నీవు అంతటను గలవు,
నీవు అన్నింటా ఉన్నావు,
మరి నీవు అంతటికి.అన్నింటికీ ఆవలనుందువు.
నీవు ఆకాశమున గలవు,పాతాళమున గలవు,
నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు;
అన్ని భూమికలందున్నావు ,అన్ని భూమికలకుఅతీతుడవు.
నీవు మూడు లోకాలలో నున్నావు,ముల్లోకాల కావలకూడా నున్నావు.
నీవు అగోచరుడవు,స్వతంత్రుడవు,నీవు సృష్టి కర్తవు ప్రభులకు ప్రభుడవు
అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు ;
నీవు సర్వ శక్తి మంతుడవు ,సర్వ వ్యాపివి ,
నీవే అనంత జ్ఞానము ,అనంత శక్తియు ,
అనంత ఆనందమును,నీవు జ్ఞాన సాగారుడవు ,
సర్వజ్ఞుడవు ,అనంత జ్ఞానివి;
త్రికాల వేదివి, జ్ఞానమే నీవు.
నీవు సర్వ దాయాలుడవు,నిత్య శుభంకరుడవు ;
నీవు ఆత్మలకెల్ల నాత్మవు ,
అంత గుణ విశిష్టుడవు.
నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి ;
నీవే సత్యమునకు మూలము,ప్రేమ మహా సాగారుడవు,
నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు ;
నీవు ప్రభుడవు,పరాత్పరుడవు .
నీవు పరబ్రహ్మవు.
అల్లాహ్; ఎలాహీ;
యజ్దాన్ ,ఆహూరామజ్ దా;
ప్రియతముడైన భగవంతుడవు,
నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు.
పశ్చాతాప ప్రార్థన
ఓం పరభ్రహ్మ పరమాత్మ !
యా - యజ్దాన్-లా ఇలాహ్ ఇల్లల్లాః !
ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ !
పరమదయానిదివగు ఓ ఈశ్వరా !
మా పాపములన్నిటికినీ,
మేము పచ్చాతాప పడుచున్నాము .
అసత్యము ,అధర్మము ,అపవిత్రమునగు మా ప్రతి తలంపునకునూ
మేము పచ్చాతాప పడుచున్నాము .
పలికియుండరాని పలికిన ప్రతి మాటకును,చేసియుండరానిచేసిన ప్రతి చేతకునూ
మేము పచ్చాతాప పడుచున్నాము .
స్వార్ధముచే ప్రేరేపింపబడినప్రతి పనికినీ ,ప్రతి మాటకునూ,ప్రతి తలంపునకునూ,
ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికినీ,ప్రతి మాటకునూ,ప్రతి తలంపునకునూ,
మేము పచ్చాతాప పడుచున్నాము .
ముక్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకూ ,
కామ ప్రేరితమగు మా ప్రతి చేతకూ ,పలికిన ప్రతిఅనృతమునకూ,
సమస్త కపట వర్తనమునకూ,ఆడి తప్పిన ప్రతి వాగ్ధానమునకూ,
సమస్త పర నిందలకూ ,పరోక్ష నిందలకూ
మేము పచ్చాతాప పడుచున్నాము .
ఇంకనూ ముక్యముగా కూడా ,
పరులకు నాశనము ఒనగూర్చునట్టి
మేము చేసిన ప్రతి పనికినీ,
ఇతరులకు భాద కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును,చేసిన ప్రతి చేతకునూ ,
ఇతరులకు భాద కలుగవలెననిమేము కోరిన ప్రతి కొర్కెకునూ,
మిక్కిలి పచ్చాతాప పడుచున్నాము .
అపార దయానిధి వగు ఓ ఈశ్వరా !
మేము చేసిన ఈ మా పాపములు అన్నింటికినీ
మమ్ము క్షమింప వేడుకొనుచున్నాము.
తలపులలో ,మాటలలో, చేతలలో ,
నీ ఇచ్చానుసారము నదుచుకొనజాలక
నిరంతరము విఫలలమగుతున్న
మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము.
మండలి ప్రార్థన
ప్రియతమ దైవమా నిన్నుఅధికాధికముగా ప్రేమించుతకును
ఎంతో అధికముగా
ఇంకనూ అధికముగా
నీతో ఇఖ్యము పొందగల అర్హత సంపాదించు నంత వరకునూ మా అందరికి తోడ్పడుము .
ఇంఖను బాబా కొంగును చిట్ట చివరి వరకు
వీడకుండని విదముగా మా అందరికి
సహాయ భూతుడవు కమ్ము.
No comments:
Post a Comment