Tuesday, 29 July 2014

Meher Baba prayer in Telugu

                                                   ప్రభు స్తుతి



ఓ పర్వర్దిగార్ !

సర్వపోషకా ! సర్వరక్షకా !
నీవు ఆదియును అంతమును లేనివాడవు,
అద్వయుడవు,నిరుపమానుడవు,
నీ ప్రమానమెవ్వరును ఎరుంగనేరరు.
నీవు వర్ణము,నామము,రూపము,గుణములు లేని వాడవు,
నీవు అపరిమితుడవు,గంభీరుడవు .ఉహాతీతుడవు,
భావనాతీతుడవు,శాశ్వతుడవు  ,నాశనము లేనివాడవు,
నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గానినిన్నుఎవ్వరును చూడజాలరు.
నీవు ఎల్లప్పుడూ నుంటివి,నీవు ఎల్లప్పుడూ నున్నావు,
నీవు ఎల్లప్పుడూ నుందువు,నీవు అంతటను గలవు,
నీవు అన్నింటా ఉన్నావు,
మరి నీవు అంతటికి.అన్నింటికీ ఆవలనుందువు.  
నీవు ఆకాశమున గలవు,పాతాళమున గలవు,
నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు;
అన్ని భూమికలందున్నావు ,అన్ని భూమికలకుఅతీతుడవు.
నీవు మూడు లోకాలలో నున్నావు,ముల్లోకాల కావలకూడా నున్నావు. 
నీవు అగోచరుడవు,స్వతంత్రుడవు,నీవు సృష్టి కర్తవు ప్రభులకు ప్రభుడవు 
అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు ; 
నీవు సర్వ శక్తి మంతుడవు ,సర్వ వ్యాపివి ,
నీవే అనంత జ్ఞానము ,అనంత శక్తియు ,
అనంత ఆనందమును,నీవు జ్ఞాన సాగారుడవు ,
సర్వజ్ఞుడవు ,అనంత జ్ఞానివి;
త్రికాల వేదివి, జ్ఞానమే నీవు.
నీవు సర్వ దాయాలుడవు,నిత్య శుభంకరుడవు ;
నీవు ఆత్మలకెల్ల నాత్మవు ,
అంత గుణ విశిష్టుడవు.
నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి ;
నీవే సత్యమునకు మూలము,ప్రేమ మహా సాగారుడవు,
నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు ;
నీవు ప్రభుడవు,పరాత్పరుడవు .
నీవు పరబ్రహ్మవు.
అల్లాహ్; ఎలాహీ;
యజ్దాన్ ,ఆహూరామజ్ దా;
ప్రియతముడైన భగవంతుడవు,
నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు.



పశ్చాతాప ప్రార్థన 



ఓం పరభ్రహ్మ పరమాత్మ !

యా - యజ్దాన్-లా ఇలాహ్ ఇల్లల్లాః !
ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ !
పరమదయానిదివగు ఓ ఈశ్వరా !
మా పాపములన్నిటికినీ,
మేము పచ్చాతాప పడుచున్నాము .
అసత్యము ,అధర్మము ,అపవిత్రమునగు మా ప్రతి తలంపునకునూ
మేము పచ్చాతాప పడుచున్నాము .
పలికియుండరాని పలికిన ప్రతి మాటకును,చేసియుండరానిచేసిన ప్రతి చేతకునూ 
మేము పచ్చాతాప పడుచున్నాము .
స్వార్ధముచే ప్రేరేపింపబడినప్రతి పనికినీ ,ప్రతి మాటకునూ,ప్రతి తలంపునకునూ,
ద్వేషముచే  ప్రేరేపింపబడిన ప్రతి పనికినీ,ప్రతి మాటకునూ,ప్రతి తలంపునకునూ,
మేము పచ్చాతాప పడుచున్నాము .
ముక్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకూ ,
కామ ప్రేరితమగు మా ప్రతి చేతకూ ,పలికిన ప్రతిఅనృతమునకూ,
సమస్త కపట వర్తనమునకూ,ఆడి తప్పిన ప్రతి వాగ్ధానమునకూ, 
సమస్త పర నిందలకూ ,పరోక్ష నిందలకూ 
మేము పచ్చాతాప పడుచున్నాము .
ఇంకనూ ముక్యముగా కూడా ,
పరులకు నాశనము ఒనగూర్చునట్టి 
మేము చేసిన ప్రతి పనికినీ, 
ఇతరులకు భాద కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును,చేసిన ప్రతి చేతకునూ ,
ఇతరులకు భాద కలుగవలెననిమేము కోరిన ప్రతి కొర్కెకునూ,
మిక్కిలి  పచ్చాతాప పడుచున్నాము .
అపార దయానిధి వగు ఓ ఈశ్వరా !
మేము చేసిన ఈ మా పాపములు అన్నింటికినీ
మమ్ము క్షమింప వేడుకొనుచున్నాము.
తలపులలో ,మాటలలో, చేతలలో ,
నీ ఇచ్చానుసారము నదుచుకొనజాలక  
నిరంతరము విఫలలమగుతున్న 
మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము.

మండలి ప్రార్థన 

ప్రియతమ దైవమా నిన్నుఅధికాధికముగా  ప్రేమించుతకును 
ఎంతో అధికముగా 
ఇంకనూ అధికముగా
 నీతో ఇఖ్యము పొందగల అర్హత సంపాదించు నంత వరకునూ మా అందరికి తోడ్పడుము . 
ఇంఖను  బాబా కొంగును చిట్ట చివరి వరకు
 వీడకుండని విదముగా మా అందరికి
 సహాయ భూతుడవు కమ్ము. 






UNIVERSAL PRAYER

O Parvardigar! The Preserver and Protector of All,
You are without beginning and without end.
Non-dual, beyond comparison,
and none can measure You.
You are without color, without expression,
without form and without attributes.
You are unlimited and unfathomable;
beyond imagination and conception;
eternal and imperishable.
You are indivisible;
and none can see you but with eyes divine.
You always were, You always are,
and You always will be.
You are everywhere, You are in everything, and
You are also beyond everywhere and beyond everything.
You are in the firmament and in the depths,
You are manifest and unmanifest;
on all planes and beyond all planes.
You are in the three worlds,
and also beyond the three worlds.
You are imperceptible and independent.
You are the Creator, the Lord of Lords,
the Knower of all minds and hearts.
You are Omnipotent and Omnipresent.
You are Knowledge Infinite, Power Infinite and Bliss Infinite.
You are the Ocean of Knowledge,
All-knowing, Infinitely-knowing;
the Knower of the past, the present and the future;
and You are Knowledge itself.
You are all-merciful and eternally benevolent.
You are the Soul of souls, the One with infinite attributes.
You are the Trinity of Truth, Knowledge and Bliss;
You are the Source of Truth, the Ocean of Love.
You are the Ancient One, the Highest of the High.
You are Prabhu and Parameshwar;
You are the Beyond God and the Beyond-Beyond God also;
You are Parabrahma; Paramatma; Allah; Elahi; Yezdan;
Ahuramazda, God Almighty, and God the Beloved.
You are named Ezad, the Only One Worthy of Worship.

wikipedia link


PRAYER OF REPENTANCE

We repent, O God Most Merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done.

 

We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred.

 

We repent most specially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled and for all slander and backbiting.

 

Most specially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain and for every wish that pain should befall others

 

In your Unbounded Mercy we ask You to forgive us,
O God for all these sins committed by us and to forgive us for our constant failures to think and speak and act according to Your Will.


PRAYER FOR BABA LOVERS


Beloved God help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you and help us all to hold  fast to baba's daaman till the very end.